కుడా మాస్టర్ ప్లాన్, వరంగల్ నగర అభివృద్ధి, నగర ఎంట్రెన్స్ లలో జంక్షన్స్ ఏర్పాటు,అభివృద్ది తదితర అంశాలపై కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు పసునూరి దయాకర్,బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ వరంగల్ కు వివిద చోట్ల నుండి వచ్చే ఎంట్రెన్స్ లలో బటర్ ఫ్లై జంక్షన్ల ఏర్పాటు,సుందరీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నగరంలో వివిద కూడళ్ళ వద్ద జంక్షన్ల అభివృద్ధితో రోడ్ల మరమ్మత్తులు చేపట్టి నగర వాసులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేలా నిర్ణయించి అదికారులకు సూచనలు చేయడం జరిగిందన్నారు..
ఈ కార్యక్రమంలో కూడా అధికారులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.