Home / SLIDER / వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్..అదిక సంఖ్యలో వ్యాపారాలు చేస్తూ జీవిస్తారు..వ్యాపార సముదాయాల్లో సిబ్బంది,హమాలీలు,గుమస్తాలు తమ జీవనోపాది కోసం పనిచేస్తుంటారు..వారి సర్వీస్ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తారు.. కరోనా బారిన పడేందుకు,వ్యాది వ్యాప్తి చెందేందుకు ఇక్కడ నుండి ఆస్కారం ఉంటుంది..

కరోనా నివారణ చర్యల్లో బాగంగా వారి ఆరోగ్యం,ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశ్యంతో వరంగల్ తూర్పు లోని వ్యాపార,వాణిజ్య,చాంబర్ ఆఫ్ కామర్స్,గుమస్తాలకు,సిబ్బందికి వాక్సినేషన్ ప్రక్రియను 28 వ డివిజన్ లో గిర్మాజిపేట లోని గుజరాతి భవన్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు..

కరోనా నేపద్యంలో ప్రభుత్వం నిత్యం ప్రజలకు అందుబాటులో సేవలు అందించేవారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించి సూపర్ స్పైడర్స్ కు వాక్సినేషన్ పక్రియ కొనసాగుతున్న విషయం తెలిసింది..ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక చొరవ తీసుకుని వ్యాపార కేంద్రమైన వరంగల్ తూర్పులో నిత్యావసర సరుకుల రవాణా జరుగుతున్న నేపద్యంలో వ్యాపారస్తులు,చాంబర్ ఆఫ్ కామర్స్,హమాలీలు,గుమస్తాలు,సిబ్బంది కరోనా బారిన పడే అవకాశం ఎక్కువ ఉండటం,వారి ద్వారా ప్రజలకు సైతం వ్యాపించే అవకాశం ఉన్నందున హైరిస్క్ కలిగి ఉన్న నేపద్యంలో వారికి ప్రత్యేకంగా వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించారు.తద్వారా వ్యాపారస్తులు,గుమస్తాలు,హమాలీలు,సిబ్బంది కి రక్షణ కల్పించినట్టైంది..

మాస్క్,వ్యక్తిగత పరిశుభ్రత,వాక్సినేషన్ రక్ష..

మాస్క్ ,వ్యక్తికత పరిశుభ్రత,బౌతికదూరం,వాక్సినేషన్ నే కరోనా నుండి రక్ష అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.వాక్సినేషన్ సెంటర్ ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనాను నివారించాలనే దృడ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ గార్లు పనిచేస్తున్నారని,రాష్ట్ర మరియు ప్రజల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ నుండి పలు సడలింపులను ఇచ్చారని,ఈ సడలింపుల సమయంలో వరంగల్ తూర్పు నిత్యం వ్యాపారాలకు కేంద్రమని,నిత్యావసర సరుకుల రవాణా,ఇతర వ్యాపారాలు జరుగుతుంటాయని వారి రక్షణ తమ బాద్యతగా బావించి వారికి,చాంబర్ ఆఫ్ కామర్స్,వ్యాపారస్తులు వారి సిబ్బందికి,హమాలీలు,గుమస్తాలకు వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించామన్నారు..

వాక్సిన్ వేయించుకోవటం ద్వారా కరోనా వస్తే ప్రాణాలు కోల్పోయే రిస్క్ నుండి తప్పించుకున్న వాళ్ళవుతారని అందుకోసమే ఈ రోజు ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేసి వాక్సిన్ అందించడం జరుగితుందన్నారు..ఈ వాక్సినేషన్ ప్రక్రియను నిర్దేశించిన రంగాలకు చెందిన వారు వినియోగించుకోవాలని సూచించారు..

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు గందె కల్పన నవీన్,దిడ్డి కుమారస్వామి,ఎం.ఎచ్.ఓ రాజారెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీ.రమేష్ బాబు,మాజీ కార్పోరేటర్లు,చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు,ముఖ్య నాయకులు,వ్యాపారసంఘాల నాయకులు,వైద్యులు,తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat