తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు మరో ప్రచారం. ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.
పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.
ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు సమాచారం అందుతుంది. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు జూన్ 3 న ఖాళీ అయ్యాయి. కోవిడ్ కారణంగా ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్.రమణకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.