ఏపీ ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కోసం 13 జిల్లాల్లో పాదయాత్ర చేసే జననేతకు స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర గతిని మలుపుతిప్పే మహాక్రతువులో తాము సైతం భాగస్వాములం అవుతామని స్పష్టంచేస్తున్నారు.
ఇక మహనేత వైఎస్ తనయుడుగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో నాడు ప్రజల కోసం కనీ వినీ ఎరుగని రీతిలో పాదయాత్ర చేసి.. సంచనం సృష్టించిన వైఎస్ బాటలోనే నడవడానికి పూనుకున్నజగన్ కోసం ఊరు వాడా.. అంతా ఎదురు చూస్తున్నారు. ఇక పల్లె ప్రజలైతే జగన్ కోసం వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ఇక మరోవైనపు జగన్‌మోహన్‌రెడ్డి కడప పెద్దదర్గా ప్రార్థనలకు వెళ్తున్నారని తెలుసుకున్న పల్లె ప్రజానీకం ప్రధాన రహదారిపైకి చేరిపోయారు. వి.కొత్తపల్లె, చాగలేరు క్రాస్, తాళ్లపల్లె, నందిపల్లె, వేంపల్లె, కుమ్మరాంపల్లె, వీరన్నగట్టుపల్లె నుంచి గండిక్షేత్రం వరకూ ప్రజలు రోడ్డుపైకి చేరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ను గ్రామ గ్రామానా నిలిపి శుభాకాంక్షలు చెప్పారు.
మేమంతా నీ వెంటే.. అంటూ పులివెందుల ప్రజలు దీవెనలందించారు. గండిక్షేత్రం నుంచి కడప పెద్ద దర్గాకు వెళ్తుండగా నందిమండలం, పెండ్లిమర్రి, వెల్లటూరు, మిట్టమీదపల్లె, కృష్ణాపురం, బిల్టప్ సమీపంలో వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏది ఏమైనా ఏపీలో జగన్ చేపట్టిన సంకల్ప యాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.