టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చెప్పుకో తగ్గ అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మీదే ఫోకస్ మొత్తం పెడుతోందట. ఎక్కువగా ముంబైలోనే బిజీగా గడుపుతోంది. అడపా దడపా హిందీ సినిమాలు చేస్తున్న ఈమెకి స్టార్ స్టేటస్ మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం 'సర్దార్ కా గాడ్సన్' అనే రొమాంటిక్ కామెడీ మూవీలో అర్జున్ కపూర్ సరసన నటిస్తుంది. ఈ సినిమా హిట్ అయితేనే అక్కడ సెటిలయ్యే అవకాశం ఉందట. లేదంటే చిన్న చితకా పాత్రలే దక్కుతాయని చెప్పుకుంటున్నారు. తెలుగులో అవకాశాలు లేవు కాబట్టి, బాలీవుడ్‌లో అకాశాలు అందుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే అజయ్ దేవగన్, సిద్దార్థ్ మల్‌హోత్రా నటిస్తున్న థాంక్ గాడ్, అలాగే మేడే, అటాక్ సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు గనక హిట్ అయితే బాలీవుడ్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదంటున్నారు. ఇక తెలుగులో రకుల్ నటించిన క్రిష్ - వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.