తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని సీతాఫలమండి లో ఆశా వర్కర్లు గా పని చేస్తున్న వారికి కార్పొరేటర్ హేమ సామల గారి అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ గారు హాజరై ఆశా వర్కర్లు కి నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ సామల గారిని అబినందిచారు.కరోనా సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆశా వర్కర్లు అని కొనియాడారు.
అనంతరం హేమ సామల మాట్లాడుతూ ఆశా వర్కర్లకు సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉంది అన్నారు కరోనా సమయంలో వారు చేస్తున్న సేవలు మరువలేవని వారికి ఎంత చేసిన తక్కువే అవుతుందని తెలిపారు.వారికి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సాయి,దుర్గ ప్రసాద్, గౌతమ్,మహేష్,మహిళా నాయకులు పద్మ,అర్చన పాల్గొన్నారు