తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేటలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వారానికి 2 సార్లు ఊరంతా శానిటైజేషన్, శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు, ఊర్లోకి ఎవరు వచ్చినా సాయంత్రానికే వెళ్లిపోవడం వంటి పంచాయతీ తీర్మానాలతో ఆ ఊరు భద్రంగా ఉంది.
సెకండ్ వేవ్‌లో ఒక వ్యక్తికి స్పల్ప లక్షణాలు కనబడినా టెస్ట్ చేయిస్తే నెగెటివ్ వచ్చింది.