తెలంగాణలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రంలో గడచిన రెండు వారాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల నిర్వహణ మరో పెద్ద సమస్యగా మారింది. టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి.
కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. టెస్ట్ జరగకపోవడంతో అందరితో కలిసి ఉంటున్నారు.. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది.