ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. ప్రజా భవన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగాలు ఇప్పించాలని పెద్ద ఎత్తున వచ్చిన జనాలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు.
ప్రజా భవన్లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.