క్రిస్మస్ రోజునే తన ప్రియుడు జాకీ భగ్నానీ పుట్టినరోజు కూడా కావడంతో తన ప్రియబాంధవుడికి తన సోషల్‌మీడియా ద్వారా అక్షరాలతో ప్రేమను కురిపించేసింది రకుల్ ప్రీత్.ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా ముద్దు ముద్దు సమాధానాలిచ్చేసింది.
‘మా ప్రేమకు రెండేళ్లు. క్రిస్మస్‌రోజునే తను పుట్టాడు. ఇదేరోజు సరిగ్గా రెండేళ్ల క్రితం మాలో ప్రేమ చిగురించింది. అందుకే ఇది మాకు స్పెషల్‌డే.’ అని చెప్పింది రకుల్.‘శాంటా నాకిచ్చిన బహుమతి నువ్వు. నీ నవ్వు, నీ జాలిగుణం.. నీ మంచితనం, నీ ప్రేమ నాకు వరం. హ్యాపీ బర్త్‌డే బేబీ..
ఇకనుంచి ప్రతి రోజూ నువ్వు కోరుకున్నవన్నీ సమృద్ధిగా నీకు దొరకాలి. హ్యాపీ క్రిస్మస్..’ అంటూ పోస్ట్ పెట్టింది రకుల్‌ప్రీత్‌సింగ్. మరి పెళ్లెప్పుడు? అనడిగితే.. ‘జీసెస్ ఎప్పుడంటే అప్పుడు..’ అంటూ తెలివిగా సమాధానమిచ్చేసింది.