తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంధ్రభారతిలో ఈ నెల 30న నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు కలిసి ఆటా గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించారు.
ఆటా గ్రాండ్ ఫినాలేకు హాజరై తమ సందేశాన్ని వినిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, 18వ ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, కన్వీనర్ సాయి సూధిని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త తదితరులు పాల్గొన్నారు.