తెలంగాణ రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ పాలన మొదలైన దగ్గర నుండి విద్యుత్ రంగంలో ఇప్పటివరకు రూ.81,516 కోట్ల అప్పు ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఈరోజు గురువారం రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. డిస్కంలకు రూ.62,461కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని డిప్యూటీ సీఎం విక్రమార్క తెలిపారు.