తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలకు విద్యుత్ అందించామని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే… మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.
‘2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ ₹44,434 కోట్లు. అప్పులు ₹22,423 కోట్లు. ప్రస్తుతం విద్యుత్ రంగ ఆస్తుల విలువ ₹1,37,570 కోట్లు ఉంది..
అప్పుల విలువ ₹81,516 కోట్లుగా ఉంది. అప్పులు చేసి ఆస్తులు సృష్టించాం. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేదు’ అని ప్రభుత్వ శ్వేతపత్రంపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వివరణ ఇచ్చారు.