గత ఏడాది కాలంగా వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్లు సహా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కోల్పోతున్న టెక్ దిగ్గజం యాపిల్‌కు మరో గట్టి షాక్ తగిలింది. తన పేరిట 1000 కంపెనీ పేటెంట్లు కలిగిన సీనియర్ డిజైనర్ పీటర్ రసెల్ క్లార్క్ రాజీనామా చేశారు.
టెక్ దిగ్గజంలో దాదాపు రెండు దశాబ్ధాల పాటు సేవలందించిన క్లార్క్ కంపెనీ నుంచి వైదొలిగారు.యాపిల్‌లో క్లార్క్ చివరి ప్రముఖ సీనియర్ ఇండస్ట్రియల్ డిజైనర్ కావడం గమనార్హం. ఇప్పుడు క్లార్క్ నిష్క్రమణ యాపిల్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఐమ్యాక్, ఐప్యాడ్ నానో, మ్యాక్‌బుక్ ప్రొ, మ్యాక్‌బుక్ ఎయిర్ సహా యాపిల్ ప్రధాన ఉత్పత్తుల హార్డ్‌వేర్ డిజైన్‌ను ఆయన పర్యవేక్షించేవారు. పలు ఐఫోన్, ఐప్యాడ్ మోడల్స్‌కు డెవలప్‌మెంట్ టీంల్లో క్లార్క్ కీలక పాత్ర పోషించారు.