తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారుల కోసం కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి అర్హులైన ప్రతోక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి అర్హులు అప్లై చేసుకోవచ్చు.
ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు.
కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈవిషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు