తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సిటింగ్ జడ్జితో పాటు అంతర్జాతీయ, జాతీయస్థాయి నిపుణులతో ఒక టెక్నికల్ కమిటీని వేసి విచారణ జరిపించాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు.
‘ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని నీళ్లు ఇచ్చారు. ఎంత కరెంటు బిల్లు కట్టారు. ఖర్చుకు తగ్గ ఫలితం వస్తుందా? ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాలి? అనే విషయాలు తేల్చాలి. ఆ తర్వాతే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.