తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి రోజే ఇంత భయపడితే ఎట్ల..? మంత్రులు ఉలిక్కి పడటం సరికాదు అని కేటీఆర్ అన్నారు.
శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.పదేండ్లు విధ్వంసం జరిగిందన్నారు. మరి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది.
జీవన విధ్వంసం చెప్పాలి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించారు. గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ ఏపీ చరిత్ర మాట్లాడొద్దు అంటారు. పాపం వారి సభ్యుడే వారిని ఇరికిస్తున్నారు. వాస్తవాలు చెప్పాలి కదా..? సాగునీరు, తాగునీరు, కరెంట్ ఇవ్వలేని అసమర్థత గురించి చెప్తే ఉలికిపాటు ఎందుకు..? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.