తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్నికాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. దానిపై సభ్యులు ప్రసంగిస్తున్నారు.
కాగా, ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అదేవిధంగా ప్యానల్ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, బాలూనాయక్, కౌసర్ మొయియుద్దీన్, కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ ప్రకటించారు.