ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి) ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలో చేరనున్నారు.
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ చీఫ్ . మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.