తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తన సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ‘పార్టీ మారాలనుకునేవారు ఇప్పుడే మారండి.
పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదు. ఎవరెవరు నమ్మక ద్రోహం చేశారో నా దగ్గర చిట్టా ఉంది. ఇప్పటికైనా వారు తీరు మార్చుకోవాలి’ అని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.