టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వాడిన 7వ నంబర్ జెర్సీని ఇకపై ఏ ఇతర ప్లేయర్ తీసుకోకుండా రిటైర్ చేయనుంది.
క్రికెట్ కు మిస్టర్ కూల్ చేసిన సేవకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఆటగాళ్ల కోసం 60 రకాల బేసి సంఖ్యలను కేటాయించామని తెలిపారు. గతంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ వాడిన 10వ నంబర్ జెర్సీని కూడా రిటైర్ చేసిన విషయం తెలిసిందే.