Home / SLIDER / ఎంపీ పదవికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రాజీనామా..?

ఎంపీ పదవికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రాజీనామా..?

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా సచివాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. నల్గొండ-ముషంపల్లి-ధర్మాపురం రోడ్‌ నాలుగు లైన్లకు పెంపు, కొడంగల్‌, దుడ్యాల రహదారుల విస్తరణ దస్త్రంపై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఎంపీగా రాజీనామా చేస్తానని వెల్లడించారు.

రేపు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి రాష్ట్ర రహదారులపై చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని 14 రోడ్లకు నేషనల్‌ హైవే హోదా ఇవ్వాలని, విజయవాడ-హైదరాబాద్‌ హైవేను 6 లైన్లకు విస్తరించాలని కోరతామని పేర్కొన్నారు.

అలాగే హైదరాబాద్‌-కల్వకుర్తి రోడ్డును 4 లైన్లకు పెంచాలని అడుగుతామన్నారు. ఈ మేరకు ఐదు దస్త్రాలను రేపు గడ్కరీకి చూపించి అనుమతి కోరతామని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat