తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ పథకం అమలుతో రోజుకు సగటున రూ.4కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీకి సగటున రోజుకు రూ.14కోట్ల రాబడి వస్తోంది..
ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఉంటున్నారని చెప్పారు. ఈ పథకంపై చర్చించేందుకు ఇవాళ ఆయన సీఎం రేవంత్రెడ్డితో భేటీ కానున్నారు.