టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ మొదలైంది.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం విక్రమార్క ఆధ్వర్యంలో పలు శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో ప్రజాదర్భార్ కొనసాగుతుంది.
ఈ ప్రజా దర్భార్ కు రాష్ట్ర నలుమూలాల నుండి వేలాది ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన సమస్యలను,దరఖాస్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పిస్తున్నారు.