తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ విషయమై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సీఎం రేవంత్ సమాచారం అందించారట. ఒకవేళ అందుకు ఒవైసీ అంగీకరిస్తే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా డిసెంబరు 9న అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.