ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో టీజేఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.
ఈ దృష్ట్యా ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే కోదండరామ్‌తో రేవంత్ రెడ్డి పలుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రె స్‌తో టీజేఎస్ పొత్తు పెట్టుకునేలా చేశారు.
తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ కోదండరామ్ ప్రకటించడంతో టీజేఎ్‌సకు సీట్లు కేటాయించలేదు. కానీ.. ఇరు పార్టీల మధ్య మైత్రీ బంధం కొనసాగింది. అదే సందర్భంలో కొత్త ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తామని ప్రకటించారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందన్న వార్తలు బయటకు వచ్చాయి.