తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు ఉదయం బాత్రూంలో జారిపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.
ఈ సంఘటనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి గాయం కావడంతో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి.. పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో యశోద ఆసుపత్రి దగ్గర తగిన భద్రత పెంచాలని సంబంధితాధికారులను ముఖ్యమంత్రి అనుముల రేవంత్ ఆదేశించారు. దీంతో ఆసుపత్రి దగ్గర అధికారులు భద్రతను పెంచారు.