ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజు రవితేజ చేయాల్సిన సినిమా ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇదే కథను హిందీలో సన్నీ డియోల్తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గదర్-2తో ఈ ఏడాది బిగ్ హిట్ అందుకున్న సన్నీకి గోపి ఇప్పటికే కథ వినిపించారట. స్టోరీ లైన్కు గ్రీన్ సిగ్నల్ రావడంతో స్క్రిప్ట్ మార్పులు చేస్తున్నారని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.