తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఆమెకు అగ్రికల్చర్ & కోఆపరేషన్ డిపార్ట్మెంటులో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు.
హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఆమె విధులు నిర్వర్తించనున్నారు. ఆమె నెలకు రూ.50,000లు జీతం అందుకోనున్నారు.