తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ లోని ఫర్నిచర్ ను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు.రవీంద్ర భారతి లోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయం లో ఉన్న ఫర్నిచర్ , కంప్యూటర్స్, పలు ఫైల్స్ ఓ వాహనంలో తరలిస్తుండగా పట్టు కున్న ఓయూ విద్యార్థి నాయకులు.ప్రభుత్వ వస్తువులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘా నేతలు ధర్నాకు దిగారు.సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన ఓయూ సంఘాల నాయకులు.