తెలంగాణ లో కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని 128-చింతల్ డివిజన్ ఎన్ ఎల్.బి.నగర్, శ్రీనివాస్ నగర్, పద్మశాలి బస్తి, వివేకానంద నగర్, రోడా మేస్త్రి నగర్, వల్లభాయ్ పటేల్ నగర్ లలో నిర్వహించిన ప్రచారానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ లోని అన్ని బస్తీలలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ వంటి మౌలిక వసతులను కల్పించామని రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని అన్ని కాలనీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు.
అభివృద్ధిని కొనసాగించేందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మూడవ నెంబర్ పై ఓటు వేసి ముచ్చటగా మూడవసారి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.