బి.ఆర్.ఎస్ పార్టీపై, నాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని..కంటికి రెప్పలా కాపాడుకుంటామని పరకాల బి.ఆర్.ఎస్.అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16 వ డివిజన్ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన బిజెపి వరంగల్ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు గోదాసి రాజకుమార్ (చిన్న) ఆధ్వర్యంలో ధర్మారం, కీర్తినగర్,గరీబ్ నగర్,జాన్ పాక,పోతరాజుపల్లి గ్రామాలకు చెందిన వారి అనుచరులు 300 మందితో మూకుమ్మడిగా బిజెపి పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ప్రజలకు మేలు జరగాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. పాత, కొత్త నాయకులు అందరు కలిసి కట్టుగా పని చేసి బీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని, మ్యానిఫెస్టోను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు.పరకాలలో పోటీలో ఉన్నకాంగ్రెస్,బిజెపి పార్టీల అభ్యర్థులు పరకాల ప్రజలకు ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగలగాలని సూచించారు.ఆ రెండు పార్టీలు తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశాయని విమర్శించారు.
ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ ద్రోహ పార్టీల అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమని అన్నారు.పార్టీలో చేరిన వారిలో ..గోదాసి వీరేశం,బైకాని శివ పవన్,అనిల్,గట్టికొప్పుల సునీల్,ముస్కు కోటయ్య,బండి మల్లేశం,శీలం పూర్ణచందర్,శివరాత్రి కృష్ణ,షైక్ రియాజ్,ఎండి జానీ,శివరాత్రి శేఖర్,గడ్డం విష్ణు,పర్కారి హేమలత,ముద్దసాని ఇందిరా,బొద్దిరెడ్డి తిరుపతి రెడ్డి,సత్యనారాయణ వనం,దేవునూరి రాధాకృష్ణ,గడ్డం విష్ణు,సాయిని శ్రీరామ్ లతో పాటు 300 మందికి పైగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి,కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్,వరంగల్ మార్కెట్ చైర్మన్ గోలి రాజయ్య,మాజీ జిల్లా కో అప్షన్ కొమ్ముల కిషొర్,మాజీ ఎంపిటిసి పిట్టల రాజు,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నాసం మల్లేశం,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బొల్లం రాజయ్య ,గంగుల నాగరాజు,బొల్లం శ్రీధర్,ఓ. రాజు,మొట్ట రాజు తదితరులు పాల్గొన్నారు.