ఎన్నికల్లో గెలువడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. స్వార్ధంతో ఎన్నికల్లో ఓట్లు రాల్చుకుని గద్దెనెక్కేందుకు అడ్డదారుల్లో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయి. కులాలను చీల్చుతూ సామాజిక అశాంతికి ఉత్ప్రేరకాలుగా కుట్ర పూరిత స్వభావాన్ని వ్యాపితం చేస్తున్నాయి. బీసీ, ఎస్సీ, మైనారిటీ తదితర డిక్లరేషన్ ల పేరిట కాంగ్రెస్ పార్టీ వైషమ్యాలు సృష్టిస్తున్నది. ఇప్పటికే పేదల వ్యతిరేకపార్టీగా, మత విద్వేషాలను ఓటు బ్యాంకుగా మార్చుకునే పార్టీగా పేరున్న బీజేపీ పార్టీ ఇంకొక అడుగు ముందుకు వేసి కులాల మధ్య చీలికలు తెచ్చేలా సమావేశాలు ఏర్పాటు చేస్తూ మిగతా వర్గాలపైకి ఉసి కొల్పుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎ న్నికల స్టంట్ లో భాగంగా కులాల వారీగా మతాల వారీగా కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు ప్రజలకు అవగతమవుతున్నది.అయితే ఉద్యమ పార్టీగా ఉండి అధికారపార్టీగా మారిన బీఆర్ఎస్ ……బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికల్లో సబ్బండ వర్గాలు తమ వారనే విషయాన్ని చెబుతూ గెలుపువైపు పరుగులు పెడుతున్నది. దీనికి హేతుబద్ధతను కూడా ఉదహరిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రచారంలో దూసుకుపోతున్నది.
గంగాయుమునా తహజీబ్ అంటూ మహాత్మగాంధీ మాటలను గుర్తుకుచేస్తూ తెలంగాణ పాలనను బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. తమ పాలనలో కుల, మత వివక్ష లేదంటూ అందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే పెద్ద ఉదాహారణలంటూ కుండబద్దలు కొడుతున్నది. బీసీలకు లక్ష సహాయం చేస్తే ..మైనారిటీలకు లక్ష గ్రాంటుగా అందజేస్తున్న విషయం ఘంటాపథంగా చెబుతూ వస్తున్నది. హిందువులకు కల్యాణలక్ష్మి ఇస్తుంటే ముస్లీం ఆడపడచుల వివాహానికి షాదీముబారక్ వంటి పథకం అందిస్తున్నది. దేవాలయాల నిర్మాణానికి తమ పాలనలో ఎంత ప్రాధాన్యత ఇచ్చామో .మసీదులకు, చర్చిలకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నామని బీఆర్ఎస్ పదేపదే స్పష్టం చేస్తున్నది.బీఆర్ఎస్ పార్టీకీ కులమత బేధాలు లేవని లౌకిక పార్టీఅని తన కార్యాచరణ ద్వారా నిరూపిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మత ఘర్షణలు, కల్లోహాలు జరుగుతున్నాయని కర్ఫ్యూ విధిస్తున్నారని, తెలంగాణలో శాంతి, భద్రతలు పటిష్టంగా ఉన్నాయని శాంతి, భద్రతలు పటిష్టంగా ఉన్నాయని, బీఆర్ఎస్ పాలనలో కర్ఫ్యూ విధించలేదనే వాస్తవాన్ని ప్రజలకు వివరిస్తున్నదాపార్టి. బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడం కాదు.. వాస్తవానికి ప్రజలకు కూడా తెలిసింది అదే. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఎటువంటి మత కల్లోహాలు లేవు. కర్ఫ్యూలేవు. సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. సర్వమత సమానత్వం, పరమత సహనం వెల్లివిరుస్తున్నది. ఇవన్నీ మన కండ్ల ముందు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ముస్లీం మైనారిటీలకు అప్పటి ప్రభుత్వం 10 ఏండ్లలో కేవలం రూ.900 కోట్లు ఖర్చు పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ప్రజా ఆశీర్వాదసభలో పునరుద్ఘాటిస్తున్నారు. ఇది చాలు తెలంగాణలో లౌకికత్వం ఎలా ఉందో అంచనా వేయడానికి.
ఎస్సీ వర్గీకరణలో భాగంగా తెలంగాణలో జరిగిన మాదిగల సభకు, బీసీల సభకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరవ్వడం నిజంగా చర్చించాల్సిందే. అసలు వర్గీకరణపై నాటకమాడుతుందెవ్వరో మాదిగలకు తెలియంది కాదు. వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ ఏనాడో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. దీనిని నాన్చుతున్నది ప్రస్తుతం కేంద్రంలో ఉన్న నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ కదా. రిజర్వేషన్ పై చిత్తశుద్ధి ఉంటే ఇన్నాళ్లు ఏమి చేసినట్లు? ఈ విషయంలో స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి రాష్ట్రంలో , కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు..?ఎన్నికలు వస్తేనే వర్గీకరణ ఎందుకు బీజేపీ, కాంగ్రెస్ లకు గుర్తొస్తుంది. కేవలం ఎన్నికల హామీగానే వర్గీకరణ సమస్య మూడు దశాబ్దాలుగా సమస్యగానే మిగిలిపోయింది. వీటన్నింటికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే సమాధానం చెప్పాల్సి ఉంది.
ఇక బీసీల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న బీజేపీ , కాంగ్రెస్ లు ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా ప్రేమ కురుపిస్తున్నాయి? వాస్తవానికి చట్టసభలో బీసీ రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి పంపింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మరి ఇప్పటివరకు ఎందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ బీసీలకు అనుకూలంగా నిర్ణయం ఎందుకు తీసుకోలేదు. ఇప్పుడు బీసీ సీఎం అంటూ బీసీలకు అన్యాయం జరిగినట్లు ఎందుకు ప్రకటిస్తున్నదో స్పష్టంగా ప్రజలకు తెలుసు. అంతెందుకు మైనారిటీ రిజర్వేషన్ పెంచాలని బీఆర్ఎస్ కేంద్రానికి లేఖలు రాస్తే ఇప్పటివరకు బీజేపీ స్పందించలేదు. పైగా మతపరమైన రెస్ర్వేషన్లంటూ వున్న వాటినే రద్దుచేస్తామంటున్నది. అసలు ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్, అన్యాయం చేస్తున్న బీజేపీలు కపట ప్రేమ నటిస్తూ కల్లిబొల్లి మాటలు చెబుతే ప్రజలు నమ్ముతారా?. ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనైతికంగా వ్యవహరిస్తున్నాయి. పార్టీల ఊసరవెల్లి విధానాలను చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు. ఓట్ల కోసం ప్రజాస్వామ్య విలువలను పణంగా పెడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఓటుతో సిద్ధం అయ్యారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలందరూ మొగ్గు చూపుతూ గెలుపుకు అండగా నిలుస్తున్నారు. నవంబర్ 30 న పోలింగ్ బూత్లల్లో తమ ఓటు ను కారు గుర్తుమీద గుద్దేందుకు సిద్దమైనారు