కర్ణాటక రాజకీయాల్లో ‘నీలి చిత్రాల’ దుమారం రేగింది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. శివకుమార్ గతంలో నడిపిన సినిమా హాళ్లలో నీలి చిత్రాలు (పోర్న్ ఫిల్మ్స్) ప్రదర్శించేవారంటూ ఆరోపించారు.
దొడ్డనహళ్లి, కనకపుర సమీపంలోని సతనూర్‌లలో ఆయన నిర్వహించే సినిమా థియేటర్లలో అశ్లీల చిత్రాలు ప్రదర్శించేవారని చెప్పారు. ‘ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు అటువంటి నేతను ఎన్నుకొన్నారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ అధికారం అప్పగించింది. ఇదీ.. అతని (డీకే శివకుమార్) సంస్కృతి’ అంటూ పేర్కొన్నారు. ఈ ఆరోపణలను డీకే ఖండించారు.