వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధిస్తారని, రఘునందన్ రావు ఓటమి ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో ప్రభాకర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. గతంలో వెయ్యి ఓట్లతో గెలిచిన వ్యక్తి మాటలకు ఆగం కావొద్దన్నారు.
2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయాలన్నారు. నాడు ఊర్లో ఎవరైనా చనిపోతే కరెంట్ అధికారులను బతిమలాడి కరెంట్ వేసుకొని స్నానాలు చేసే వారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని అంటున్నాడు . రైతు బంధు వద్దు, ధరణి వద్దు అని మరొకరు అంటారు. అలాంటి పార్టీలు కావాలా? రైతుబంధు పెంచుతామంటున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఒక్క సారి తప్పు చేస్తే 50 ఏండ్లు ఏనుకాకు పోతం.
30 తారీఖు నాడు కారు గుర్తు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగడం సిగ్గుచేటని మండిపడ్డారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డ్ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభాకర్ అన్న ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మీరు అందరూ ఓటు పోట్లు పొడవాలి..కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రిని చేద్దామన్నారు. దుబ్బాకలో ఇంకా అభివృద్ధి జరుగాల్సి ఉన్నది. దుబ్బాకను అభివృద్ధి చేసే బాధ్యత మాది, ఓట్లు వేయండి పనులు చేసుకోండని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.