Home / SLIDER / అభివృద్ధిని ఆకాంక్షించి బిఆర్ఎస్ కు ఓటు వేయండి

అభివృద్ధిని ఆకాంక్షించి బిఆర్ఎస్ కు ఓటు వేయండి

126-జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దుం నగర్, శ్రీనివాస్ నగర్, రింగ్ బస్తీలలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోటీ పడుతుందన్నారు.

నాడు బస్తీలలో ఎక్కడ చూసినా మురుగు పరుగు, మంచినీటి కటకటలతో ప్రజలు అల్లల్లాడే వారని కానీ నేడు సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మంత్రి కేటీఆర్ గారి సహాయ సహకారాలతో మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో మురుగు సమస్యకు చెక్ పెట్టి నూతన సిసి రోడ్లను వేసుకొని బస్తీలను అభివృద్ధి చేసుకున్నామని, ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తూ అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మూడవ నెంబర్ పై ఓటు వేసి ముచ్చటగా మూడవసారి బిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.

అనంతరం రింగ్ బస్తీలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్ ఆధ్వర్యంలో రింగ్ బస్తీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాదాపు 400 మంది పురుషులు, మహిళలు, యువకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : శోభారాణి, జితేందర్ పటేల్, రాజమణి, జయశ్రీ, సుష్మా దేవి, అంజలి, సాగర్ పటేల్, చిరంజీవి, లక్ష్మణ్, బుజ్జమ్మ, శుభం పటేల్, కృష్ణ, మోను పటేల్, రవి కుష్వాహ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు క్రిష్ణ గౌడ్, పాపులు గౌడ్, మల్లారెడ్డి, జైహింద్, ఆయా కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat