కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో 126 – జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ నాయకులు సయ్యద్ రషీద్ గారి ఆధ్వర్యంలో రింగ్ బస్తీకి చెందిన పలువురు యువకులు, మహిళలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ గారి సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి చేశామని రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేపడుతామన్నారు. పార్టీలో నూతనంగా చేరిన వారు మనం చేసిన అభివృద్ధి – మానిఫెస్టో ద్వారా చేపట్టబోయే ప్రగతిని ప్రజలకు వివరించి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మూడవ నెంబర్ పై ఓటు వేసి భారీ మెజార్టీ వచ్చే విధంగా పని చేయాలన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు: శోభారాణి, జితేందర్ పటేల్, సుష్మా దేవి, అంజలి సింగ్, రాజమణి, జయశ్రీ, చిరంజీవి, క్రిష్ణ, లక్ష్మణ్, హిమచరణ్, పూజామా, సాగర్ పటేల్ లు..ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.