పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణంలోని 6,7,8 వార్డు లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న పరకాల బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సంవృద్దిగా పంటలు పండుతున్నాయని,దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపు పరిపాలనని ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి తద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని,సాగునీరు అందించడం వలన రైతులు పంటలు పండించడం వలన దేశానికి అన్నం పెట్టే విధంగా అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మారిందని అన్నారు..
నిత్యావసర వస్తువుల ధరల పెంచిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమని పేద వాడి దగ్గర దోచి, కార్పొరేట్ సంస్థలకు పెట్టుతున్నాడాని అన్నారు.కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల హయాంలో పూర్తి కానీ ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు.సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా అడబిడ్డలకు నెలకు రూ.3000 చొప్పున ఇచ్చే పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేయబోతున్నారని,దీంతో ఇంట్లో అత్తకు రూ.5000 పెన్షన్ , కొడలుకు రూ.3000 రాబోతున్నాయని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ బీమా అనే పథకం ప్రకటించారు .
రాష్ట్రంలో తెల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించబోతున్నామని అన్నారు.నియోజకవర్గంకు టెక్స్ట్ పార్క్ తీసుకువచ్చామని దాని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని అన్నారు.మరోసారి ఆశీర్వదించండని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు..ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండలం నాయకులు , కార్యకర్తలు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు..