తెలంగాణలో ఖమ్మం నియోజకవర్గంలోని ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఆధ్వర్యంలో యజమాన్యం వారి సహకారంతో ఖమ్మంలోని TNGO’s ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామాత్యులు శ్రీ గౌ|| పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గోన్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ సంయుక్త కమిటి గౌరవ అధ్యక్షులు శ్రీ పల్లా కిరణ్ కుమార్ గారు మరియు కోఆర్డినేటర్స్, కోసూరు శ్రీనివాస్, కోగిరెక్క ఉమాశంకర్, SK సిద్ధాసాహెబ్, నాగేందర్, కాంతారావు మరియు ఈ కార్యక్రమనికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్ జే సి కృష్ణ గారు, యజమాన్యాలు పాల్గొన్నారుపువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడతూ త్వరలో ఏర్పడబోయే BRS ప్రభుత్వంలో మీకు ఉన్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని తప్పకుండా పరిషరిస్తానని అన్నారు. మీకున్న ప్రధాన డిమాండ్లు
1. ప్రభుత్వం తరపున హెల్త్
కార్డులు.
2. గృహలక్ష్మి ఇండ్ల స్థలాల కల్పన
3. టీచర్స్ మరియు లెక్చరర్స్ తరపున ప్రత్యేక సంక్షేమనిధి.
4. ప్రభుత్వ గుర్తింపు కార్డులు.
5. ఆరోగ్య భీమా వర్తింపు.
తప్పకుండా నేను పరిష్కరిస్తానని అన్నారు.
ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ మంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.ఆత్మీయ సమ్మేననానికి అధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరు అయినారు.