తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్రబాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఇవాళ కేసీఆర్ను తిడుతున్నాడు.. ఇది మర్యాదానా..? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనగామలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.రాజేశ్వర్ రెడ్డి రందీ పడుతుండు. ఎవడో జనగాం వచ్చి వర్లిపోయిండట. కుక్కులు మస్తు మొరుగుతాయి. దాన్ని లెక్క పెడుతామా..? జనగాంలో మొరిగిపోయిన కుక్క ఏం చేసిందో తెలుసా.?.
రైఫిల్ పట్టుకుని ఎవడ్రా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీదకు పోయిండు. ఆ రోజు నుంచి ప్రజలు రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టిండ్రు. వీళ్లు వచ్చి మాట్లాడుతాం అంటే కనీసం సిగ్గుండాలి అని కేసీఆర్ మండిపడ్డారు.