రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని…అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వన మహోత్సవం లో పాల్గొన్నారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పట్ల ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు.
అధికారంలో ఉన్నామని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం బాధకరమని పేర్కొన్నారు. అమీర్పేట లో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 1994లో ఎన్టీఆర్ తనకు రాజకీయ జీవితం ప్రసాధించిన మహనీయుడుని ఎన్నటికీ మరవనని స్పష్టం చేశారు.