కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూసుఫ్ గారి ఆధ్వర్యంలో అల్ హక్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా మైనారిటీలకు ప్రాధాన్యతనిస్తూ వారి సంక్షేమం పాటుపడిన పార్టీ కేవలం బిఆర్ఎస్ మాత్రమేనన్నారు. మన సంక్షేమం కోసం పాటుపడే బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయని అందించి ఆశీర్వదించాలన్నారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని ఓటర్లు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు 3వ నెంబర్ పై వేసి ముచ్చటగా మూడవసారి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆల్ హక్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ షఫిక్, ఉపాధ్యక్షులు మహమ్మద్ సలీం, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సద్దాం హుస్సేన్, షేక్ ఫరీద్, మహమ్మద్ రజాక్, మహమ్మద్ ఖాసీమ్, మహమ్మద్ సయ్యద్, మహమ్మద్ అజం, మహమ్మద్ రఫీక్, అబ్దుల్ కరీం, మహమ్మద్ మహబూబ్, మహమ్మద్ రాజు తదితరులు పాల్గొన్నారు.