కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి ఏకగ్రీవ మద్దతు తెలిపిన సోమ వంశ క్షత్రియ సంఘం (సారోళ్లు) సభ్యులు… సూరారంలోని కట్ట మైసమ్మ ఫంక్షన్ హాల్లో సోమ వంశ క్షత్రియ సంఘం (సారోళ్లు) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కే. పీ.వివేకానంద గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని కోరుకునే ఏకైక పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనన్నారు. మన సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ బిఆర్ఎస్ ను ముచ్చటగా మూడవసారి భారీ మెజార్టీతో గెలిపించుకొని హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సోమ వంశ క్షత్రియ సంఘం (సారోళ్లు) సంఘం అధ్యక్షులు జె. గోపాల్ వర్మ, ఉపాధ్యక్షులు యూ. శ్రీనివాస వర్మ, బి. మురళి వర్మ, భలేరావ్ శ్రీనివాస రావు వర్మ, జే. వెంకట్ వర్మ, ఎస్. రాజేశ్వర్ వర్మ, బి. రాజ్ కుమార్ వర్మ, ఎస్. సోమయ్య వర్మ, శ్రీకండే మనోజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.