ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మడిమకు గాయం కావడంతో.. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో అతను గాయపడ్డాడు.
వరల్డ్‌కప్ కోసం హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్‌కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా హార్దిక్‌ను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికాతో జరిగే మూడు టీ20, మూడు వన్డేలకు కూడా హార్దిక్ దూరంకానున్నాడు.