తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, సందయ్య నగర్ లలో గౌరవ కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ గారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారి సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అభివృద్ధి చేశామని, రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు..
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అని తెలియచేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని, ఈ విజయం ను ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్, పాపిరెడ్డి కాలనీ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ శ్రీకళ, రాంబాబు, పర్వీన్ బేగం, సీనియర్ నాయకులు లింగరెడ్డి, రమేష్, వేణుగోపాల్ రెడ్డి, రమణయ్య, ప్రభాకర్ రెడ్డి, పాపిరెడ్డి కాలనీ బస్తీ కమిటీ అధ్యక్షులు సాయినందన్, రాజశేఖర్, విజయ్, అనిల్, పవన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయా బస్తీ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, శ్రేయభిలాషులు, అభిమానలు తదితరులు పాల్గొన్నారు.