అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి సోమవారం దమ్మపేటలో జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కోరుతూ ఆదివారం దమ్మపేటలో నిర్వహించిన పార్టీ వాలంటీర్ల సమావేశంలో బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొని, సభ విజయవంతానికి దిశా నిర్దేశం చేశారు. సభకు పెద్ద ఎత్తున హాజరై సీఎం సభను జయప్రదం చేయాలని నామ ఈ సందర్భంగా వాలంటీర్లను, నాయకులను కోరారు.
మెచ్చా నాగేశ్వరరావు ను మంచి మెజార్టీతో గెలిపిoచాల న్నారు.వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అశ్వారావు పేట లో గెలిచేది మెచ్చా నాగేశ్వరరావు అని అన్నారు. అనంతరం ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించి, స్థానిక నాయకత్వానికి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, ఎన్నికల నియోజకవర్గ ఇంచార్జి ఉప్పల వెంకటరమణ, పార్టీ మండల అధ్యక్షులు రాజేశ్వరరావు, జెట్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, రైతు బంధు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, దమ్మపేట వైస్ ఎంపిపి దారా మల్లిఖార్జునరావు, దమ్మపేట టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, దమ్మపేట మండల కార్యదర్శి దొడ్డా రమేష్,పి. రామకృష్ణ, టి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.