తెలంగాణలో ములుగులో మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ గారు, బిజెపి పార్టీకి నిన్న రాజీనామా చేసి, ఈరోజు తెలంగాణ భవనంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, గారు, గిరిజన శిశు- సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి,సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ ములుగు ఎన్నికల ఇంచార్జి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు, మరియు రోడ్డు భవనాల కార్పొరేషన్ చైర్మన్ 4 మండలాలు ఎన్నికల ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ గారి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .
ఈ కార్యక్రమంలో మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ ,PACS చైర్మన్ తోట రమేష్,జిల్లా రైతు బంధు సభ్యులు పచ్చ శేషగిరిరావు, జిల్లా , కాకులమర్రి ప్రదీప్ రావు, వాలీబాబా , మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం, మండల నాయకులు, చిట్టీమల్ల సమ్మయ్య, యూనిస్, బుట్టో,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, తదితరులు పాలుగోన్నారు