తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో లిక్కర్ పార్టీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు సెలబ్రెటీలు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ వెంచర్లో లిక్కర్ పార్టీ చేసుకుంటున్నారని సమాచారం అందింది.
రంగంలోకి దిగిన పోలీసులు పార్టీ జరుగుతున్న ప్రదేశంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. పార్టీ నిర్వహించిన హిమజపై కేసు నమోదు చేశారు. ఇందులో పలువురు సినీ ఆర్టిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని అదుపులోకి తీసుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.