తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజే శుక్రవారం నామినేషన్ అఖరి తేది కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో ముందు ప్రకటించిన అభ్యర్థులను కాకుండా సడెన్ గా వేరేవాళ్లను ప్రకటించి వాళ్లకు పార్టీ బీఫాంలు అందజేస్తుంది ఆ పార్టీ.
మరోవైపు బీజేపీ పార్టీ ఒక జాబితాలో ఒకరి పేరు.. మరోక జాబితాలో వేరేవాళ్లను ప్రకటించి ఇటు అభ్యర్థులను.. అటు ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టెస్తుంది. తాజాగా వేముల వాడ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుగా తుల ఉమను ప్రకటించి ఇటీవల ప్రకటించిన జాబితాలో వికాస్ రావుకు స్థానం కల్పించింది.
అయితే ఈ రోజు నామినేషన్ కు అఖరి తేది కావడంతో వేముల వాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ నామినేషన్ వేశారు. అంతకుముందు వికాశ్ రావు తరపున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. చూడాలి మున్ముందు ఇంకా ఎన్ని వింతలు చూడాల్నో..?