తెలంగాణ సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
తాజాగా నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తి గ్రామం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దొన్పాల్ గణేష్, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు..తడపాకల్ గ్రామం నుంచి బీజేపీ, బీఎస్పీ నుంచి యువజన సభ్యులు, భీంగల్ మండలం బెజ్జోరా గ్రామం నుంచి 25 మంది యువజన సంఘాల సభ్యులు,మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామం నుంచి పలువురు కాంగ్రెస్ యువకులు, వేల్పూర్ మండలం లక్కొర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.